![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -129 లో..... గంగనే ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టిందని ఇన్‌స్పెక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను అలా చెయ్యలేదు.. నాకేం తెలియదని గంగ అంటుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నావా అని శకుంతల అంటుంది. నా కూతురు అలా తప్పు చేసే మనిషి కాదని లక్ష్మీ రిక్వెస్ట్ చేస్తుంది. గంగ నీ ఫోన్ ఇవ్వు అని రుద్ర తీసుకుంటాడు. అందులో గంగ, రుద్ర ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతాడు.
ఇలా ఎందుకు నమ్మకద్రోహం చేసావని రుద్ర అనగానే గంగ షాక్ అవుతుంది. నువ్వు సోషల్ మీడియాలో పెట్టకుంటే ఎందుకు నీ ఫోన్ లో ఉంటుందని రుద్ర అంటాడు. నాకేం తెలియదని గంగ అంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదని శకుంతల అంటుంది. ఏది జరిగిన గంగ ఈ ఇంటికి కోడలు తనని వెళ్ళమని చెప్పే అధికారం నీకు లేదని శకుంతలతో పెద్దసారు అంటాడు. లక్ష్మీ కళ్ళు తిరిగి పడిపోతుంటే.. అమ్మ నువ్వు నా గురించి టెన్షన్ పడకని గంగ చెప్తుంది. సూర్యకి పెద్ద సారు, లక్ష్మి వాళ్ళని ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత నేనేం తప్పు చెయ్యలేదు సర్ అని గంగ చెప్తుంది. గంగ అలాంటిది కాదని ప్రీతీ, స్నేహ, ప్రమీల, వంశీ అంటారు.
మా అమ్మ మీద ఒట్టు నేను ఏ తప్పు చెయ్యలేదని గంగ అనగానే ఎలాగ ఆరోగ్యం బాలేదు పోతే పోనిలే అని వేస్తున్నావా అని ఇషిక అంటుంది. ఇషిక మర్యాదగా మాట్లాడు అని గంగ తనపై కోప్పడుతుంది. కాసేపటికి రుద్ర కాళ్లపై గంగ పడి.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. నా తాళి మీద ఒట్టు అని చెప్తుంది. ఒకమ్మాయి తాళి మీద ఒట్టేసి అబద్ధం చెప్పదని పెద్దసారు అంటాడు. ఈ విషయం గురించి వదిలెయ్యండి అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు పైడిరాజు నిద్ర లేచి గంగ రాలేదా నిన్ననే మనతో పాటు రమ్మన్నాను కదా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |